Monday, June 8, 2026
Homeఅంతర్జాతీయంIran Talks | ఇరాన్ తో చర్చలు ముగించాలి..

Iran Talks | ఇరాన్ తో చర్చలు ముగించాలి..

  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డొనాల్ట్ ట్రంప్..
  • తనదే తుదినిర్ణయం అవుతుందని వెల్లడి..

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చలు ముగించాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టంచేశారు. ఈ శాంతి ప్రక్రియలో తనదే తుది నిర్ణయమని ట్రంప్ చెప్పారు. ఇక్కడ తానే అన్ని నిర్ణయాలు తీసుకుంటానని, నెతన్యాహు కాదని అన్నారు. భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ మధ్య కుదిరే ఒప్పందాన్ని ఆయన అంగీకరించి తీరాల్సిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఇజ్రాయెల్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం రాత్రి ఇరాన్ భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

అంతకుముందు లెబనాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌ శివార్లలో దాడులు చేశాయి. దీనికి ప్రతికారంగానే ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్‌పై ఎదురుదాడి చేయొద్దని నెతన్యాహును ట్రంప్‌ కోరనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News