Homeక్రైమ్ వార్తలుNirmal | యువకుడి హ*త్యకేసును చేధించిన పోలీసులు..

Nirmal | యువకుడి హ*త్యకేసును చేధించిన పోలీసులు..

  • నిర్మల్ పట్టణం వయస్సార్ కాలనీలో ఘటన..
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ జానకి షర్మిల..

ఈ నెల 14న నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ నగర్ కాలనీలో జరిగిన అస్లాంఖాన్ అనే యువకుడి హ*త్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. సవతి తల్లి అన్వర్రీ బేగం అస్లంతో ఉన్న అక్రమ సంబంధం ఈ హ*త్యకు ప్రధాన కారణమని ఎస్పీ తెలిపారు. అస్లాం ఖాన్ తాను పెళ్లి చేసుకుని సవతి తల్లి అక్రమ మానుకుంటానని అన్వరి బేగంతో చెప్పారు.

దీంతో అస్లాం వేరే అమ్మాయితో పెళ్లి చూపులు చూడడంతో దీన్ని జీర్ణించుకోలేని సవతి తల్లి బేగం సుఫారి గ్యాంగ్ తో హ*త్య చేయించేందుకు కుట్ర చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ప్రధాన నిందితురు ముఖిద్, అఫ్రోజ్ షేక్, సాహిత్, సాయినాథ్ పవర్, షేక్ మొహమ్మద్ ఐదుగురి సభ్యుల సుఫారీ గ్యాంగ్ను సంప్రదించారు. అస్లాంను హ*త్య చేస్తే ఆరు లక్షలు చెల్లిస్తానని అన్వర్ బేగం సుఫారి గ్యాంగ్ తో ఒప్పందం కుదిర్చుకొని మొదటి విడత కింద 50,000 అడ్వాన్స్ చెల్లించినట్టు తెలిపారు.

- Advertisement -

మహారాష్ట్రకు చెందిన ఈ గ్యాంగ్ జూన్ మొదటి వారంలో నిర్మల్కు వచ్చి ఆసుపత్రి వద్ద హ*త్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్ళిన ఆ గ్యాంగ్ ఈనెల 14 బోకర్ ,బైంసా ద్వారా నిర్మల్ అద్దె వాహనంలో చేరుకున్న ఈ గ్యాంగ్ వారి అన్వరి బేగం తో భేటీ అయ్యారు. ఆమె ఇచ్చిన ఆధారాలు,వాట్స్అప్ మెసేజ్ ద్వారా అస్లాంను వెంబడించి వైయస్సార్ కాలనీ వద్ద ఆటోలు అడ్డగించి అస్లాంను కత్తులతో పొడిచి చంపారన్నారు.

ఆ తర్వాత సారంగాపూర్ మండలం మహారాష్ట్రకు ఫరారు అయినట్టు ఎస్పీ వెల్లడించారు నిందితులు ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కకుండా తెలంగాణ బార్డర్ నుంచి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పథకం ప్రకారం హ*త్య చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. హ*త్య జరిగిన వెంటనే నిర్మల్ డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై ల బృందం ప్రత్యేక దర్యాప్తు జరిపి మహారాష్ట్రలో ఉన్న నిందితులను గుర్తించి పట్టుకుని అరెస్టు చేసినట్టు తెలిపారు. హ*త్య కేసును అతి త్వరలో చేదించిన పోలీసులకు ఎస్పీ రివార్డులను అందించారు. అయితే హ*త్యకు ప్రధాన నిందితురాలైన ఏ1 ముద్దాయిని మొదటి రోజే అరెస్టు చేసి రిమాండ్ చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. వారం రోజుల్లోనే హ*త్య కేసును చేపించడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News