Wednesday, February 25, 2026
Homeవరంగల్‌Warning | న్యూ ఇయర్ వేడుకల వేళ

Warning | న్యూ ఇయర్ వేడుకల వేళ

  • హద్దులు దాటితే కఠిన చర్యలు
  • చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి..

చెన్నారావుపేట మండల పరిధిలోని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించి హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవు.న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపడం అతివేగంగా వాహనాలు నడపడంనిర్లక్ష్య డ్రైవింగ్ రేసింగ్‌లు ట్రిపుల్ రైడింగ్ మైనర్లు వాహనాలు నడపడం వంటి నేరాలు చేస్తూ పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కేసులు నమోదు చేయబడతాయి.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపోలీసుల అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేయడం వంటి చర్యలపై కూడా కఠినంగా వ్యవహరించబడుతుంది. చెన్నారావుపేట మండల పరిధిలోని ప్రజలందరూ పోలీసులకు సహకరించి,నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా,బాధ్యతాయుతంగా జరుపుకోవాలని స్థానిక ఎస్సై రాజేష్ రెడ్డి తెలపడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News