Thursday, February 26, 2026
Homeస్పోర్ట్స్Rule | టెస్ట్ క్రికెట్ లో కొత్త రూల్..

Rule | టెస్ట్ క్రికెట్ లో కొత్త రూల్..

  • లాస్ట్ ఓవర్ లో వికెట్ పడినా 6 బంతులు ఆడాల్సిందే..

టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త రూల్ రానుంది! అక్టోబర్ 2026 నుంచి కొత్త క్రికెట్ రూల్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా, రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడితే ఆట ఆగదు, గతంలో డే ముగిసే సమయంలో వికెట్ పడితే అంతటితో అంపైర్లు ఆటని నిలిపేసేవారు. ఇప్పుడు ఆ ఓవర్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. దీనివల్ల బౌలర్లకు న్యాయం జరిగి, మ్యాచ్‌ల్లో ఉత్కంఠ మరింత పెరగనుంది.

ఎంసీసీ ఈ మార్పులతో ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాలని చూస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో కీలకమైన మార్పు రాబోతోంది. మేరీలీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అక్టోబర్ 2026 నుంచి అమల్లోకి వచ్చే కొత్త క్రికెట్ నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా ఆటను మరింత సమతుల్యంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మేరీలీబోన్ క్రికెట్ క్లబ్ స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News