అంబేద్కర్ విగ్రహాలు పెడ్తావ్.. ఆయన విలువలు పూడ్చేస్తావ్! పూల దండలు వేస్తావ్.. అయన ఆలోచనలను నేలకేసి కొడ్తావ్! “జయ భీమ్” అంటూ గొంతు పగిలేలా అరుస్తావ్.. కానీ సమానత్వం కోసం అడుగు వేయవు.. న్యాయం కోసం నిబద్దతగా నిలబడలేవు! పేదల కోసం ప్రాణం పెట్టిన మహానుభావుడిని ఫోటో ఫ్రేమ్లో బంధించి, మనసులో మాత్రం బయటకు నెట్టేశావ్! ఇది గౌరవం కాదు సమాజమా ఇది బహిరంగ అవమానం! విగ్రహం ముందు వంగే ముందు అన్యాయం ముందు నిలబడే ధైర్యం తెచ్చుకో! పూలు పెట్టే ముందు, పుస్తకం తీసుకునే నిబద్ధత తెచ్చుకో! లేకపోతే.. అంబేద్కర్ పేరు మిగులుతుంది, అయన ఆశయం చనిపోతుంది!
- కనకమామిడి సన్నీ
- Advertisement -
