మానవుడు ప్రకృతికి తలపెట్టే హాని కారణంగా
నేడు తల వంచక తప్పట్లేదు ,
ప్రకృతి ప్రళయ తాండవం ముందు…
ఒక్కరా! ఇద్దరా! వందల మంది నేడు
ప్రకృతి ఆక్రోశానికి బలి అయ్యారు…
మట్టి దిబ్బలే సమాధిగా
నేడు విగత జీవులై పడి ఉన్నారు…
కనువిందు చేసే మంచు పర్వతాలు నేడు
మనిషి వేసే అభివృద్ధి బాటల కారణంగా
నేలకొరుగుతున్నాయి…అభివృద్ధి హద్దులు దాటి,
ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంది నేడు…
నేపాల్ ఘటనలో హృదయ విదాకరమైన
సంఘటనలు నిద్రపోనివ్వట్లేదు…
చావు బ్రతుకుల నడుమ పసి పిల్లల అరుపులు,
గుండె బరువెక్కి రోదిస్తున్న ఆ కుటుంబాల
బాధకు కారకులు ఎవరు? మనమే కదా!
ప్రకృతిని కాపాడుదాం.. ఇకనైనా..!(epaper.aadabhyderabad.in)
- చాపల అనిల్ కుమార్
- Advertisement -
