HomeతెలంగాణJagtial MLA | మాజీ మంత్రి రాజేశం గౌడ్ కి పరామర్శ..

Jagtial MLA | మాజీ మంత్రి రాజేశం గౌడ్ కి పరామర్శ..

  • పరామర్శించిన జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరు సంజయ్ కుమార్ రావు..

మాజీ మంత్రి రాజేశం గౌడ్‌ను పరామర్శించారు జగిత్యాల ఎమ్మెల్యే(Jagtial MLA) డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ రావు..(Dr. M. Sanjay Kumar) మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, రాష్ట్ర తొలి కార్పొరేషన్ చైర్మన్ గొడిశెల రాజేశం గౌడ్ ను ఆయన బుధవారం వారి నివాసంలో ఆత్మీయంగా కలిసి పరామర్శించారు. గతంలో ఎడమ కాలికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రాజేశం గౌడ్, తాజాగా కుడి కాలికి కూడా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.(epaper.aadabhyderabad.in)

ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశం గౌడ్‌తో ఆత్మీయంగా ముచ్చటించిన ఎమ్మెల్యే, ఆయనకు అందుతున్న వైద్య చికిత్స, శస్త్రచికిత్స అనంతర ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో రాజేశం గౌడ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

- Advertisement -

రాజేశం గౌడ్ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన త్వరితగతిన కోలుకోవాలని డాక్టర్ సంజయ్ కుమార్ రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాజేశం గౌడ్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News