Homeమెదక్‌Tribute | సిరిపురం శంకరప్ప మృతదేహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులు

Tribute | సిరిపురం శంకరప్ప మృతదేహానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నివాళులు

సదాశివపేట: సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిరిపురం రామన్న తండ్రి సిరిపురం శంకరప్ప మృతి చెందారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అంకెనపల్లి గ్రామానికి వెళ్లి శంకరప్ప పార్తివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.(Tribute)

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓదార్చారు. శంకరప్ప మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుడ్ల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ భాను, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ నర్సింలు, నాయకులు అంజయ్య, శ్రీశైలం, ఆనంద్, రాజు, సతీష్, సంగప్ప, అగమయ్య తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News