Wednesday, June 17, 2026
Homeఆదిలాబాద్Tribute | ఘనంగా నెహ్రూ వర్ధంతి

Tribute | ఘనంగా నెహ్రూ వర్ధంతి

  • నివాళులు అర్పించిన కంది శ్రీనివాస రెడ్డి, నరేష్ జాదవ్ కాంగ్రెస్ శ్రేణులు

స్వాతంత్రం వచ్చిన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని పురోగతి వైపు నడిపించిన గొప్ప నాయకుడు దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు.బుధవారం పట్టణంలోని డీసీసీ కార్యాలయం లో నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు.

నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఆయన దూరదృష్టితో రూపొందించిన అనేక ప్రణాళికలు, ఆయన పాటించిన ప్రజాస్వామ్య విలువలు, శాంతి, విజ్ఞాన-సాంకేతిక రంగాల అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం ఆశయాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News