Thursday, May 21, 2026
Homeసినిమా#NBK111 | మూవీ పవర్‌ఫుల్ పాత్రలో మనోజ్ మంచు

#NBK111 | మూవీ పవర్‌ఫుల్ పాత్రలో మనోజ్ మంచు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం #NBK111 ఇప్పటికే మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవర్‌ఫుల్ యాక్షన్, భారీ స్థాయి మేకింగ్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మేకర్స్ తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ అప్డేట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ‘మిరాయి’తో సెన్సేషనల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మంచు మనోజ్ ఇప్పుడు #NBK111లో రా ఇంటెన్సిటీ, డార్క్ షేడ్స్ కలిగిన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. పాత్రలోని గ్రిట్, కథలోని భారీ స్థాయి మనోజ్‌ను వెంటనే ఆకట్టుకున్నాయి. ఈ మాస్ యాక్షన్ ప్రపంచానికి సరిపోయేలా ఆయన మ్యసీవ్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సిద్ధమవుతున్నారు. స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో కనిపించనున్నారు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, మంచు మనోజ్ త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నారు. బాలకృష్ణ లాంటి లెజెండరీ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మనోజ్ డైనమిక్ ఎనర్జీ తోడవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాస్ యాక్షన్, స్టైలిష్ ఎలివేషన్స్, పవర్‌ఫుల్ డ్రామాతో బాలకృష్ణను అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో గోపీచంద్ మలినేని ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు #NBK111తో అభిమానులకు మరో భారీ సినీ విందు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మనోజ్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ మరింత పెరిగింది. మిగతా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
బ్యానర్: వృద్ధి సినిమాస్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

- Advertisement -
RELATED ARTICLES

Latest News