బుధవారం దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ లో భాగంగా నస్పూర్ పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు ఒకరోజు షాపులు బంద్ చేశారు. జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కోశాధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఫార్మసీ రక్షణ, ప్రజా ఆరోగ్యం పరిరక్షణ కోసం బంద్ చేపట్టామని పేర్కొన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయా లు ఆపాలని, కార్పొరేట్ సంస్థలకు భారీ డిస్కౌంట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆన్లైన్ ఫార్మసీ వల్ల మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని, నకిలీ, మత్తు కలిగించే మందులు ప్రిస్కిప్షన్ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మద్దతుగా, తెలంగాణ కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా లోనూ మెడికల్ షాపులను ఒకరోజు బంద్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సమ్మయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
