Thursday, April 23, 2026
Homeస్పోర్ట్స్Mohammad Nawaz | పాకిస్తాన్ క్రికెట్ లో డ్ర*గ్స్ కలకలం..

Mohammad Nawaz | పాకిస్తాన్ క్రికెట్ లో డ్ర*గ్స్ కలకలం..

  • ఆల్ రౌండర్ మహ్మద్ నవాజ్ పై ఆరోపణలు..
  • డ్ర*గ్స్ వినియోగించినట్లు ఐసీసీ విచారణలో వెల్లడి..

పాకిస్థాన్‌ క్రికెట్‌లో మరో కలకలం! ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నవాజ్‌ డ్ర*గ్స్‌ వినియోగించాడని ఐసీసీ విచారణలో తేలినట్టు సమాచారం. ఇటీవల భారత్‌, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా నవాజ్‌కు డ్ర*గ్స్‌ టెస్టులో పాజిటివ్‌గా వచ్చిందని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని ఐసీసీ.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు తెలిపింది. దీనిపై పీసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ విషయంపై ఐసీసీ నుంచి మాకు సమాచారం వచ్చింది. మేం విచారణ చేపట్టాం.

ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే ఐసీసీకి అందజేస్తాం’ అని తెలపడం గమనార్హం. 32 ఏండ్ల నవాజ్‌.. ప్రపంచకప్‌లో పాక్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. నవాజ్‌ డ్ర*గ్స్‌ వినయోగించిన వార్తలు బయటకురాగానే బ్రిటన్‌లో జరిగే ‘టీ20 బ్లాస్ట్‌’ టోర్నీలో సర్రే జట్టు అతడి కాంట్రాక్టును రద్దు చేసుకుంది. విచారణలో నవాజ్‌ నేరం చేసినట్టు రుజువైతే మాత్రం అతడిపై శాశ్వత నిషేధం పడే అవకాశముంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News