Thursday, April 23, 2026
Homeస్పోర్ట్స్IPL | ఐపీఎల్ లో ఆడేందుకు మిచెల్ స్టార్క్..

IPL | ఐపీఎల్ లో ఆడేందుకు మిచెల్ స్టార్క్..

  • క్లియరెన్స్ ఇచ్చిన ఆస్ట్రేలియా కికెట్ బోర్డు..
  • త్వరలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలయిక..

పీఎల్‌లో ఆడేందుకు ఆస్ట్రేలియా మేటి బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌ కు ఆ దేశ క్రికెట‌ర్ బోర్డు క్లియ‌రెన్స్ ఇచ్చింది. ఇక ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుతో అత‌ను త్వ‌ర‌లో క‌ల‌వ‌బోతున్నాడు. మే ఒక‌టో తేదీన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో.. స్పీడ్‌స్ట‌ర్ మిచెల్ స్టార్క్ ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. మోచేయి, భుజం నొప్ప కార‌ణంగా జ‌న‌వ‌రి నుంచి స్టార్క్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన యాషెస్ సిరీస్‌లో అత్య‌ధిక వికెట్లు తీసి ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న విష‌యం తెలిసిందే.

స్టార్క్ మ‌ళ్లీ త‌న పంజా విస‌ర‌నున్నాడని, 2026 ఐపీఎల్ సీజ‌న్‌లో అత‌ను ఆర్ఆర్‌తో జ‌రిగే మ్యాచ్‌లో ఆడే ఛాన్సు ఉన్న‌ట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్ల‌డించింది. ఐపీఎల్‌లో ప్రారంభ మ్యాచ్‌ల‌కు విదేశీ ఆట‌గాళ్లు కొంద‌రు దూరం కావ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అయితే త‌న‌కు గాయ‌మైన‌ట్లు స్టార్క్ ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. గ‌త ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ త‌ర‌పున స్టార్క్ 11 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఢిల్లీ ఈ సీజ‌న్‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో అయిదో స్థానంలో ఉన్న‌ది. మూడు ఓట‌ములు, మూడు గెలుపులు ఉన్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ కూడా ఐపీఎల్‌లో ఆడ‌నున్నాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు అత‌ను త్వ‌ర‌లో తొలి మ్యాచ్ ఆడే ఛాన్సు ఉన్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News