- చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్!
విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, పోలీసుల విధులపై అవగాహన కల్పించేందుకు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్లో(Chilipched Police Station) ‘ఓపెన్ హౌస్’(Open House) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు, కేసుల నమోదు,దర్యాప్తు ప్రక్రియ,శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర గురించి వివరించారు.ప్రజల రక్షణ,నేరాల నియంత్రణలో పోలీసులు నిర్వహించే బాధ్యతలను తెలియజేశారు.
అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నర్సింలు,హెడ్ కానిస్టేబుల్ ఎలియాస్ రెడ్డి,కానిస్టేబుల్ చైతన్య కుమార్,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
