Homeరంగారెడ్డిMedical Assistance | వీరబద్ర కాలనీ మహిళకు వైద్య సహాయం అందజేత

Medical Assistance | వీరబద్ర కాలనీ మహిళకు వైద్య సహాయం అందజేత

జవహర్ నగర్ పరిధిలోని వీరబద్ర కాలనీకి చెందిన వి. విజయలక్ష్మి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం స్థానిక నాయకుడు బండకిండి ప్రసాద్ గౌడ్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సహాయ సహకారాలతో ఒక లక్ష యాభై వేల రూపాయల వైద్య సహాయం మంజూరు చేశారు.

MLA Chamakura Mallareddy Provides Medical Assistance In Veerabhadra Colony

ఈ సహాయాన్ని జవహర్ నగర్ బీఆర్‌ఎస్ నాయకులు బండకిండి ప్రసాద్ గౌడ్, కె.కె. చార్య బాధిత కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News