Friday, June 5, 2026
Homeరంగారెడ్డిFriendship | "మిత్ర యూత్ సభ్యులు ఆణిముత్యాలే."

Friendship | “మిత్ర యూత్ సభ్యులు ఆణిముత్యాలే.”

  • మిత్రుడు ముత్యాలుకు 90వేల ఆర్థిక సహాయం చేసిన మిత్రులు.
  • యూత్ సభ్యులను అభినందించిన మండల సభ్యులు.

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమే నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి.. అని ఓ కవి పాడిన గేయాన్ని ఈ స్నేహితులు రుజువు చేస్తున్నారు. స్నేహితులతో ఆనందాన్ని కలిసి పంచుకోవడమే కాదు ఆపదలో ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మేమున్నామని ధైర్యాన్నిచ్చి, తోడుగా నిలిచిన వారే అసలైన స్నేహితులని మిత్ర యూత్ సభ్యులు నిరూపించుకున్నారు.

నందిగామ మండల కేంద్రానికి చెందిన నడికూడి బెంజిమెన్ (ముత్యాలు), గత కొన్ని నెలలుగా ఊపిరితిత్తుల వ్యాధితో భాధపడున్నాడు. విషయం తెలుసుకున్న 2000-01 సంవత్సరపు 10వ తరగతి స్నేహితులైన మిత్ర యూత్ సభ్యులు ముందుకు వచ్చారు. 90వేల రూపాయలు వైద్య సహాయం నిమ్మిత్తం అందజేశారు.ఈ సందర్భంగాసందర్భంగా పలువురు మాట్లాడుతూ…

- Advertisement -

తమ స్నేహితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చిన మేము ఉన్నామంటూ ముందుకు వస్తామన్నారు. ఆ భగవంతుని కృపతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటామని,తమ స్నేహితుడు బెంజిమెన్ కూడ తొందరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. బెంజిమెన్ కుటుంబ సభ్యులు, మండల ప్రజలు స్నేహితులంటే ఇలా ఉండాలంటూ హర్షం వ్యక్తం చేస్తూ,మిత్ర యూత్ సభ్యులను అభినందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News