Monday, March 2, 2026
HomeరాజకీయంMinisters Meeting | నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

Ministers Meeting | నలుగురు మంత్రుల అత్యవసర భేటీ?

తప్పేమీ లేదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో(Telangana State Politics) సోమవారం జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోక్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిశాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhattivikramarka) నివాసంలో ఆయనతో ముగ్గురు మంత్రులు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు(Sridhar babu), అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఒకే కారులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ మంత్రుల రహస్య భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అయితే.. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. ఈ మీటింగ్‌లో తప్పేముందని ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ, పరిపాలనపరమైన పరిణామాలపై సీఎం రేవంత్‌ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక పార్టీ హైకమాండ్‌తో చర్చిస్తామని తెలిపారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్‌లతో పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ ఇవాళ భేటీ అయ్యారు. ఆ సమావేశం అనంతరం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క రాష్ట్రంలో పరిపాలన విషయంలో సమావేశం జరిపారని అనుకుంటున్నట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుండటంతోపాటు ఒక పత్రికకు, డిప్యూటీ సీఎంకి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News