Wednesday, April 22, 2026
Homeబిజినెస్Mercedes | మెర్సిడెజ్ బెంజ్ నుంచి సరికొత్త ఈవీ..

Mercedes | మెర్సిడెజ్ బెంజ్ నుంచి సరికొత్త ఈవీ..

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 750 కిమీ ప్రయాణం..
  • అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఇదే..

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌…దేశీయ మార్కెట్‌కు మరో ఈవీని పరిచయం చేసింది. సింగిల్‌ చార్జింగ్‌తో 762 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ సరికొత్త ఈవీని సీ-క్లాస్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు ఎలక్ట్రిక్‌ మోటర్స్‌తో తయారైన ఈ వాహనంలో 360 కిలోవాట్ల బ్యాటరీ కలిగివున్నది. అలాగే కేవలం 3.9 సెకండ్లలో 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్‌ చార్జింగ్‌తో 750 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించారు.

బీఎండబ్ల్యూ ఐ3 సింగిల్‌ చార్జింగ్‌తో 900 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దీని తర్వాత అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదే కావడం విశేషం. దేశవ్యాప్తంగా లగ్జరీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా ఈవీని తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ధర వివరాలు వెల్లడించలేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News