Wednesday, April 22, 2026
Homeఆరోగ్యంDiabetes | ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడమే కారణం..

Diabetes | ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడమే కారణం..

  • టైపు టు డయాబెటిక్ ని నివారించవచ్చు..
  • జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోతుంది. ప్రధానంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం లేదా శరీరం సరిపడా ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. సరైన నియంత్రణ లేకపోతే కిడ్నీ సమస్యలు, అంధత్వం, గుండె జబ్బులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కుటుంబ చరిత్ర టైప్-2 డయాబెటిస్‌కు ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్. తల్లిదండ్రులు లేదా సోదరులు ఈ వ్యాధితో బాధపడితే, కుటుంబంలోని ఇత‌రుల‌కు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దీనికి జన్యుపరమైన కారణాలతోపాటు కుటుంబంలో ఒకే విధమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కూడా కారణం అవుతాయి. ఇలాంటి కుటుంబాల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా మెటబాలిక్ సమస్యలు ముందుగానే కనిపించే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ చరిత్ర ఉన్నా కూడా ముందస్తు జాగ్రత్తలతో ఈ వ్యాధిని నివారించడం లేదా ఆలస్యం చేయడం సాధ్యమేన‌ని నిపుణులు చెబుతున్నారు. మొదట‌గా బరువును నియంత్రించడం చాలా ముఖ్యం.

- Advertisement -

సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును నిర్వ‌హించాలి. మూడవది శారీరక చురుకుదనం పెంచాలి. వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం చేయాలి. అలాగే వారంలో రెండు సార్లు వెయిట్ ట్రైనింగ్ లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం ద్వారా కండరాల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది.

జన్యుపరమైన కారణాలు ఉన్నప్పటికీ అధిక బరువు, కూర్చునే జీవనశైలి, ఒత్తిడి, వయస్సు, పాళీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, అనారోగ్యకర ఆహారం, ధూమపానం, మద్యం వంటి అంశాలు కూడా టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News