Tuesday, May 19, 2026
Homeమెదక్‌Medicine Supply | ప్రత్యామ్నాయంగా మందుల సరఫరా

Medicine Supply | ప్రత్యామ్నాయంగా మందుల సరఫరా

  • మెదక్ జిల్లా డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ చంద్రకళ

అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఈ నెల 20 న తేదీన నిర్వహించనున్న బంద్ కారణంగా మెదక్ జిల్లాలోని మెడికల్ షాపులు ఎక్కువగా మూసివేయబడే అవకాశం ఉంది. ప్రజలకు అవసరమైన అత్యవసర మరియు ప్రాణరక్షక మందుల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. అత్యవసర మందుల అవసరమైతే ప్రజలు క్రింది నంబర్లను సంప్రదించాలని సూచించారు.

హెల్ప్ డెస్క్ నంబర్లు

- Advertisement -

9440155858,
9440025572,
9985466335,

డీసీఏ హెల్ప్‌లైన్ నంబర్:

1800-599-6968

డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, మెదక్ జిల్లా:

8333818140

ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లాలోని ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న అన్ని ఫార్మసీలు మందుల సరఫరాకు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఆందోళన చెందకుండా అవసరమైన సేవలను వినియోగించుకోవాలని మెదక్ జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

    - Advertisement -
    RELATED ARTICLES

    Latest News