Homeనల్లగొండGanesh Laddu Auction | మారమ్మవాడలో ఘనంగా గణేష్ లడ్డు వేలం

Ganesh Laddu Auction | మారమ్మవాడలో ఘనంగా గణేష్ లడ్డు వేలం

  • లడ్డు దక్కించుకున్న దేశపాక కృష్ణస్వామి–వసంత కుటుంబం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మారమ్మవాడలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు అన్నదాత పులిహోర ప్రసాదాన్ని అందించిన దాత శ్రీమతి–శ్రీ దేశపాక కృష్ణస్వామి–వసంత మరియు వేలం పాటలో గణనాథుని(Ganesh Laddu Auction) లడ్డు వేల 85 116 రూపాయలు లడ్డు దక్కించుకున్న శ్రీ దేశపాక కృష్ణ స్వామి వసంత దంపతులను యంగ్ స్టార్ యూత్ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

దేశపాక కృష్ణస్వామి కుటుంబ సభ్యులకు గణేష్ మహారాజ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఉత్సవ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు కమిటీ సభ్యులు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News