వర్షం అంటే మనకు ఆనందం(Happy), చల్లదనం(Cool), ప్రకృతికి పండుగ(Festival To Nature). కానీ అదే వర్షం ఎక్కువగా కురిస్తే.. పరీక్ష(Test)లా మారుతుంది. ఈ ఎడతెరిపిలేని వర్షం మన జీవితానికి ఒక పాఠం (Lesson) చెబుతుంది. ప్రతి పరిస్థితీ రెండు ముఖాలు కలిగి ఉంటుంది. జాగ్రత్తగా ఎదుర్కొంటే కష్టమే కాదు.. కర్తవ్యం కూడా అవుతుంది. వర్షం వస్తే రోడ్లు నిండిపోతాయి (Roads Full Of Water). విద్యుత్ (Current) ఆగిపోతుంది. దారులు తడుస్తాయి. కానీ ఆ సమయమే మన సహనం, మన జాగ్రత్త, మనం కలిసికట్టుగా ఉండే శక్తిని పరీక్షిస్తుంది.
జాగ్రత్తగా ఉండటం అంటే భయపడటం కాదు. ముందే సిద్ధం కావడం. ప్రకృతిని గౌరవించడం అంటే వర్షాన్ని భరించడం కాదు. దాన్ని అర్థంచేసుకోవడం. ఇల్లు, కుటుంబం, పొరుగువారి భద్రత కూడా మన బాధ్యతే. ఒకరికొకరం సహాయం చేస్తే పెద్ద కష్టమైనా చిన్నదవుతుంది. “జీవితం ఎప్పుడూ ఎండగా ఉండదు. కానీ ప్రతి తుపాను తర్వాత ఒక చక్కని వెలుగు ఉంటుంది’’ అని వర్షం మనకు ఏం చెబుతుంది. కాబట్టి.. ఈ ఎడతెరిపి లేని వర్షంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా నిలవాలి. మనలోని మానవత్వాన్ని చూపాలి. తస్మాత్ జాగ్రత్త. ఇదే మనకు స్ఫూర్తి. ఇదే మనకు రక్షణ.
