Homeహైదరాబాద్‌Services | పోలీస్ అమర వీరుల సేవలను గుర్తుచేసుకోవాలి

Services | పోలీస్ అమర వీరుల సేవలను గుర్తుచేసుకోవాలి

సుధీర్ బాబు ఐపిఎస్, రాచకొండ పోలీస్ కమిషనర్
100 నంబర్‌కు నిమిషానికి 2 ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెల్లడి
సరూర్ నగర్‌లో పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు

తమ కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ (Uniform) లేని పోలీసులేనని రాచకొండ (Rachakonda) సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు. ఈ రోజు సరూర్ నగర్ (Saroor Nagar) స్టేడియం(Stadium)లో రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో (Police Martyrs’ Memorial Week celebrations) భాగంగా 2000 మందితో (విద్యార్థులు, కాలనీ వాసులు, తదితరులు) ప్రోగ్రాం నిర్వహించారు. దానికి సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja), సుధీర్ సండ్ర(Sudheer Sandra), డాక్టర్ కవిత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం నింపారు.

- Advertisement -
WhatsApp Image 2025 10 29 at 17.20.02 1

అనంతరం సిపి గారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రజలకు సేవలందించి అమరులైన పోలీసుల సేవలను గుర్తు చేసుకునేందుకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాచకొండ పోలుసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

రాచకొండ కమిషనరేట్ లో ప్రతి ఒక్క నిమిషానికి రెండు డయాల్ 100 ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేస్తున్నామని, పోలీసులు అన్ని రకాల సేవలను ఏక కాలంలో పనిచేసి ప్రజలకు ఆరు విభాగాలుగా ఏర్పడి విజుబుల్ పోలిసింగ్ లో భాగంగా సేవలు అందిస్తు, ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు.

WhatsApp Image 2025 10 29 at 17.20.02

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పిల్లలకు దూరంగా ఉండే సీనియర్ సిటిజెన్స్ కి వారి ఇంటింటికి వెళ్లి సహాయసహకారం అందిస్తున్నామని అన్నారు.ఆపరేషన్ స్మైలీతో ప్రజలకు దగ్గర కావడం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యమని, దేశంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా బాల కార్మికులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్తు అందించామని గుర్తు చేశారు.

ప్రజల కోసం విధులు నిర్వహించే పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మెరుగైన సమాజం కోసం ప్రజలు కూడా యూనిఫామ్ లేని పోలీసులేనన్నారు. ప్రజలకు సేవలంధించే క్రమంలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి అందరికీ తెలిసిందేనని దేశంలో ఎన్.బి.డబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్ గా రాచకొండ కమిషనరేట్ నిలిచింది రాచకొండ సిపి సుధీర్ బాబు గుర్తు చేశారు.

WhatsApp Image 2025 10 29 at 17.20.03

ప్రజలకు సేవలంధించే పోలీసుల సేవలను ప్రజలు గుర్తించాలి, ప్రజలకు అందించే సేవలను తెలియజేసేందుకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని, ప్రజలకు ఫ్రెండ్లీ పోలిసింగ్ తో పాటు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసే వాళ్ళను శిక్షించడంలో రాచకొండ పోలీసులు ఎపుడైనా ముందుంటుందని గుర్తు చేశారు.

అనంతరం సుద్దాల అశోక్ తేజ్ మాట్లాడుతూ.. పోలీసులతో గానీ, ప్రతి ఒక్కరితో మనం కృతజ్ఞత కలిగి ఉండాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉన్నట్లు మనం కూడా ప్రెండ్లీ సిటిజెన్ లాగా ఉండాలని, దేశం కోసం, మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నామో దానికి కారణం పోలీసులేనని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం కొన్ని పాటల రూపంలో ప్రజలు ఎలా ఉండాలో తెలిపారు.

WhatsApp Image 2025 10 29 at 17.20.03 1

సుధీర్ సంద్ర మాట్లాడుతూ.. సోషల్ మీడియా(Social Media)కు విద్యార్థులు ఎంత దూరం ఉండాలో, సమాజంలో ఎలా మెదలాలో సూచించారు. పోలీసులు పడుతున్న కష్టాలని కళ్ళకి కట్టినట్లు చూపించి పోలీసుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ తదితర వాటిపట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చూసి వివరించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి పద్మజా ఐపీఎస్, ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఐపిఎస్, యాదాద్రి భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఐపిఎస్, డీసీపీ క్రైమ్స్ అరవింద్ బాబు, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ విమెన్ సేఫ్టీ ఉషా రాణి, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, ఎస్బి డీసీపీ జి నరసింహ రెడ్డి, డీసీపీ ఎస్ఓటి రమణ రెడ్డి, డీసీపీ ట్రాఫిక్ -1 శ్రీనివాస్, డీసీపీ ట్రాఫిక్ -2 శ్రీనివాసులు, సైబర్ క్రైమ్స్ డీసీపీ నాగలక్ష్మి, రోడ్ సేఫ్టీ డీసీపీ మనోహర్, డీసీపీ హెడ్ క్వార్టర్ శ్యామ్ సుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసిపిలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025 10 29 at 17.19.07
- Advertisement -
RELATED ARTICLES

Latest News