విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలో డీఈఓ కొరడా
ఇప్పటికే ఉపాధ్యాయుడి సస్పెన్షన్, పోక్సో కేసు, రిమాండ్
కూసుమంచి మండలంలోని నరసింహులగూడెం ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు (Teacher) లైంగిక వేధింపు(Torture)లకు పాల్పడిన విషయాన్ని ‘ఆదాబ్ హైదరాబాద్’ (Aadab Hyderabad) వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా విద్యాధికారిణి (DEO) డా.పి.శ్రీజ విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుణ్ని సస్పెండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడు బి.శివరావు ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

తాజాగా ఈ విషయంలో జిల్లా విద్యాధికారిణి మరికొందరు ఉద్యోగులపైనా (Action) కొరడా ఝుళిపించారు. విధుల్లో (Duty) అలసత్వం (laziness) ప్రదర్శించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(School Principal) బి.శివరావుపై చర్యలు తీసుకున్నారు. ‘ఆదాబ్ హైదారాబాద్’లో వార్త ప్రచురితమయ్యే వరకు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించడంతో అక్టోబర్ 23 నుంచి 27 వరకు 5 రోజుల వేతనాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
