తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో శనివారం శిశుమందిర్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రతిబింబించేల ఈ వేడుకలను వారు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు పాఠశాల నుండి మన సంస్కృతి, సాంప్రదాయాలకు గౌరవం పెంచే విధంగా బతుకమ్మ పండుగ వేడుకలను ఎలా నిర్వహించాలో తెలియజేసేందుకే ఈ బోనాల పండుగ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు..

ముందుగా ఎల్లమ్మ, దుర్గ మాత,చిత్రపటాలకు పూలమాలవేసి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులచే బోనాలను సాంప్రదాయపద్ధంగా అలంకరించి, వేపకొమ్మలు చేతుల బట్టి, బోనాలు నెత్తిన ఎత్తుకొని విద్యార్థులు ఆటపాటలతో పాడుతూ బోనాల ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపులో పోతరాజు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు
