Homeభక్తిKrishna Mantra | కృష్ట నమ స్మరణతో అన్ని సమస్యలు దూరం అవుతాయి..

Krishna Mantra | కృష్ట నమ స్మరణతో అన్ని సమస్యలు దూరం అవుతాయి..

  • జీవితంలోని అశాంతి దూరం అవుతుంది..
  • కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే..

కృష్ణ నామ స్మరణ నిత్యం చేస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. మనస్సులోని అశాంతిని, జీవితంలోని కష్టాలను దూరం చేసి.. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాల చెంత ప్రశాంతతను ప్రసాదించే దివ్య స్తోత్రం “కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే”. ఈ పవిత్ర మంత్రాన్ని నిత్యం ఆలకించడం వల్ల గృహంలో సానుకూల శక్తి పెంపొందుతుంది. ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి తొలగిపోయి, జీవితంలో ధార్మిక మార్గంలో నడిచే సద్బుద్ధి, ఆత్మస్థైర్యం లభిస్తాయి. ఆ గోపాలకృష్ణుని లీలలను స్మరిస్తూ, మీ నిత్య ఆధ్యాత్మిక సాధన కోసం ఈ పవిత్ర మంత్రం 108 సార్లు రోజు వినడమో.. పఠించడమో చేయండి.

శ్రీకృష్ణుని ద్వాదశ నామాలు: కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర.

- Advertisement -

మహామంత్రం : హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే |హరే రామ హరే రామరామ రామ హరే హరే ||

కృష్ణ నామ స్మరణ ఫలితాలు..

పాప విముక్తి : కృష్ణ నామాన్ని జపించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని పండితులు చెబుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ముక్తి మార్గం : భగవద్గీతలోని సారాన్ని ఆకళింపు చేసుకుంటూ, నిరంతరం ఆ దేవదేవుని నామాన్ని స్మరిస్తే భవబంధాలు తొలగిపోతాయట. కృష్ణనామ స్మరణం – కలిదోష నాశనం అని పండితులు చెబుతారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News