నల్గొండ జిల్లా కాంగ్రెస్(Nalgonda District Congress)లో అంతర్గత కుమ్ములాటలు(Internal Conflicts) మరోసారి బైటపడ్డాయి. బీసీ బిడ్డ(BC Leader) డీసీసీ అధ్యక్షుడు(DCC President) పున్న కైలాష్ నేత(Punna Kailash Netha)ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అవమానించారు(Insult). తాను స్టేజ్ మీద ఉండగా వాడు రావడానికి వీల్లేదంటూ పోలీసులను కోమటిరెడ్డి ఆదేశించారు. చండూర్ మండలం అంగడిపేటలోని బీఆర్‌సీ గార్డెన్‌లో బోయపల్లి సురేందర్ దశ దిన కర్మలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత రాగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్ది స్టేజ్ మీదికి వస్తున్నాడు నువ్వు తర్వాత రా అంటూ స్టేజి పైకి రానివ్వకుండా పోలీసులతో బయటకు పంపించారు.

