Thursday, January 15, 2026
EPAPER
Homeక్రైమ్ వార్తలుRape Case | కటకటాలపాలైన కేరళ ఎమ్మెల్యే

Rape Case | కటకటాలపాలైన కేరళ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ(Congress Party) నుంచి బహిష్కరణకు(Expelled) గురైన కేరళ ఎమ్మెల్యే(Kerala Mla) రాహుల్ మామ్కూటతిల్(Rahul Mamkootathil).. అత్యాచారం కేసులో అరెస్టై జైలు(Arrest and Jail) పాలయ్యాడు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పతనంతిట్ట జిల్లా మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో గత నెలలోనే ఈ కేసు నమోదైంది. ఒక వివాహితను హోటల్‌కి ఆహ్వానించిన నిందితుడు ఆమెను రేప్ చేయటమే కాకుండా అబార్షన్(Abortion) చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇతనిపై గతంలో పలు కేసులు నమోదైనప్పటికీ అరెస్ట్ చేయకుండా కోర్టు రక్షణ కల్పించింది. కానీ.. తాజాగా వెలుగుచూసిన ఈ కేసులో కటకటాలపాలు కాకతప్పలేదు. నిందితుణ్ని నాటకీయంగా శనివారం రాత్రి పాలక్కడ్‌లోని ఒక హోటల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పతనంతిట్ట జిల్లాకు తీసుకొచ్చి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై 2023లో మరో మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. నిందితుడిపై ఇప్పటికే రెండు రేప్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మూడో కేసులో అరెస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News