- జంగలి శ్రీనివాస్ పిలుపు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఆధ్వర్యంలో ఈనెల 25న మునీరాబాద్‌లోని ఆధ్వయ కన్వెన్షన్‌లో సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు జవహర్ నగర్ జాగృతి నాయకుడు జంగలి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సబ్బండా వర్గాల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ అనంతరం వచ్చిన ప్రభుత్వాల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు.
అమరవీరుల ఆశయాలను సాధించడం, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడడం, సామాజిక తెలంగాణ నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా కవితక్క కొత్త రాజకీయ శక్తిగా ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ సభకు తెలంగాణ నలుమూలల నుండి ఉద్యమకారులు, మేధావులు, మహిళలు, నిరుద్యోగులు, యువతీ యువకులు, సబ్బండా వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని జంగలి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
