- ఆర్టీసీ డ్రైవర్ మృతి పై భారత కార్మికసంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టియు.) జాతీయ కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు షేక్ షావలి, కె.కిషన్ పత్రిక ప్రకటన
- బలవన్మరణాలకు గురైన తెలంగాణ ఉద్యమ కళాకారుడు గజ్వేల్ గిరిపల్లె మల్లెషం, డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి, 13 సంవత్సరాలు కావస్తున్న నేటికీ తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ సమూహాలు బలవన్మరణాలకు పాల్పపడడం అధికార, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలకు పరాకాష్ట అని ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కార్యదర్శి షేక్ షావలి, రాష్ట్ర అధ్యక్షులు కె.కిషన్ శుక్రవారం రోజు పంపిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. 2026, ఏప్రిల్-23, గురువారం రోజు వరంగల్, నర్సంపేట ఆర్టీసీ డిపోకి చెందిన సీనియర్ డ్రైవర్ శంకర్ గౌడ్ వంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకొని చనిపోయిన ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ఇది ముమ్మాటికీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మరియు గత బీఆర్ఎస్ పాలకులు అనుసరించిన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల్లో బాగంగా జరుగిన హత్య అని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండవరోజు ఆర్టీసీ సమ్మెలో చోటుకున్న డ్రైవర్ మరణంపై అందరికీ అందరూ మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటయిన విషయమని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయ స్వలాభం కసం ప్రభుత్వ ఆస్తులను, సంస్థలను నిర్వీరం చేయడాన్ని తప్పుపట్టారు.
దేశాన్ని, రాష్ట్రాన్ని బడా కార్పోరేట్, ప్రవేట్ వ్యక్తల ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కుట్రలో బాగమే జరిగిన శంకర్ గౌడ్ ఆత్మహత్య అని అన్నారు. దేశంలో రాష్ట్రంలో వివిధ సెక్షన్ల ప్రజానీకం తమ మనుగడలో బాగంగా జీవించే హక్కు కొరకు పోరాడుతున్న వారిపట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని, మొండివైఖరిని పాలకులు అనుసరించడం వలనే రోజురోజుకు బలవంతపు మరణాలు పెరగడానికి కారకులు అయ్యారని మండిపడ్డారు. తమ ఓటు బాంకు రాజకీయ చదరంగంలో ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్న దళారీ, దోపిడీ పాలకవర్గాలకు వ్యతిరేకంగా న్యాయమైన, ప్రజాస్వామికమైన సమస్యల పరిష్కారం కోరకు పోరాడుతున్న శక్తులు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
వీరోచితమైన సమరశీల పోరాటాలకు సిద్దం కావాల్సిన అవసరాన్ని ఆర్టీసీ డ్రైవర్ మరణం పోరాడే శక్తుల కర్తవ్యాన్ని సూచిస్తున్నదని అన్నారు. బలవన్మరణాలు సమస్యలను పరిష్కరించలేవనే విషయాన్ని పోరాడే ప్రజలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, కార్మికులు, రైతులు, విద్యార్థి, విద్యార్థినీలు, మహిళలు గ్రహించాలని కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కార్మికవర్గ ఐక్యతను చాటుతూ ఉద్యమించడం ద్వారానే సాధ్యం అని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిగా, కళాకారుడిగా తన ఆట, మాట, పాటలతో ముందుండి ఉద్యమించిన గజ్వేల్ ప్రాంతానికి చెందిన గిరిపల్లి మల్లేషం, తన కుటుంబ సమస్యలతో ఒకపక్క ఇబ్బంది పడుతూనే ప్రత్యేక రాష్ట్రంలో కూడ గత ప్రభుత్వ, ప్రస్తుత ప్రభుత్వ ద్వంద విధానాలకు వ్యతిరేకంగా పోరాడారని, ఎంతోమంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తప్ప, తెలంగాణ రాష్ట్రం సిద్దించలేదనే విషయాన్ని గ్రహించి, తీవ్ర మనోవేదనకు గురైయ్యాడని అన్నారు.
కానీ చివరికి తన ఆత్మబలిదానంతోనైన పాలకులు ఉద్యమకారుల కవులు, కళాకారుల సమస్యలను పరిష్కరిస్తారని బావించి, బలవన్మరణానికి పాల్పపడ్డాడని గుర్తుచేశారు. అటు గిరిపల్లి మల్లేషం, డ్రైవర్ శంకర్ గౌడ్ లాంటివాళ్ళు ఇంకెంత మంది ఆత్మబలిదానాలు చేసుకోవాలని ప్రశ్నించారు.
తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగా అధికారాన్ని చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తూ, పోరాడే ప్రజల సహనాన్ని పరీక్షకు గురిచేయడం ఇంతకన్న దుర్మార్గం, అప్రజాస్వామికం మరొకటి ఉండదని అని ఎండగట్టారు. ఇప్పటికైన ఎన్నికల హామీలతో పాటు ఆర్టీసీ, తెలంగాణ ఉద్యమకారుల చట్టబద్ద సంక్షేమబోర్డు సమస్యలను పరిష్కరించాలని షేక్ షావలి, కె.కిషన్ డిమాండ్ చేశారు. వెంటనే డ్రైవర్ మరణానికి ప్రభుత్వం నైతిక బాద్యత వహిస్తూ రెండు కోట్ల నష్టపరిహారాన్ని అందించి, అతని కుటుంబంతో పాటు గజ్వేల్ గిరిపల్లె మల్లేషం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోని, తగిన ఎక్స్ గ్రేషియా ప్రకటించేలా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మరియు ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తూ ఉద్యమించాలని కోరారు.
