Homeనిజామాబాద్‌Negligence | ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే స్పందిస్తారా…!

Negligence | ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే స్పందిస్తారా…!

  • మృత్యుకుహరంగా మారిన ప్రధాన రహదారి కల్వర్టు: ప్రమాదం జరిగే వరకు అధికారుల మొద్దు నిద్ర వీడరా..!
  • కామారెడ్డి – ఎల్లారెడ్డి రోడ్డుపై ప్రమాదకరంగా కుంగిన కల్వర్టు ..! పట్టించుకోని అధికారులు..!

తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయం మూల మలుపు సమీపంలో కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు కృంగి పోయి కూలడానికి సిద్ధంగా ఉంది. ప్రతిరోజు ఈ రహదారి వెంట వేల వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు . మూలమలుపు ఆనుకొని ఉన్న ఈ కల్వర్టు గతంలో కురిసిన భారీ వర్షాలకు కింద బేస్మెంట్ కొట్టుకుపోయి కూలడానికి సిద్ధంగా ఉంది. వాహనదారులు కొద్దిగా ఏమరపాటుగా ఉన్న ప్రమాదం భారిన పడతారు.

గతంలో ఒక ఆటో, పలువురు వాహనదారులు కాల్వర్టు గోతిలో పడి ప్రమాదాల బారిన పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ఈ గుంతలో పడి గాయపడుతున్నారు. రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ ప్రమాద తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రమాదం తప్పించడానికి సూచికగా గ్రామస్తులు పక్కన రాళ్లు పెట్టారు.ఒక పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లితే తప్ప అధికారులు స్పందించరా అని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కల్వర్ట్ కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News