Homeవరంగల్‌JD Lakshminarayana | ఏకాగ్రతే విద్యార్థికి విజయ రహస్యం.

JD Lakshminarayana | ఏకాగ్రతే విద్యార్థికి విజయ రహస్యం.

  • మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.
  • వంద శాతం ఉత్తీర్ణతని సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి.
  • వరంగల్ విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు

ప్రతి విద్యార్థికి ఏకాగ్రతే విజయ రహస్యమని సీబీఐ మాజీ అధికారి అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వరంగల్, పర్వతగిరి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థుల కొరకు చేపట్టిన ప్రేరణ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి జె.డి మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు అంటే భయం వీడాలని ఏకాగ్రతతో చదివి పరీక్షలకు సిద్ధమై వాటిని ఆనందంగా ఎదుర్కోవాలని అన్నారు.

JD Lakshminarayana Motivates Students in Warangal0 1

పరీక్షలకు సంసిద్ధంగా లేని విద్యార్తె పరీక్షలంటే ఆందోళన చెందుతారని అన్నారు. ప్రతి విద్యార్థి నిత్యజీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ముందుగా క్రమశిక్షణను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల కొరకు రోటరీ క్లబ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన వరంగల్ విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధులు అవ్వాలని వంద శాతం ఉత్తీర్ణతని సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.

- Advertisement -
JD Lakshminarayana Motivates Students in Warangal1

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశలోనే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. జీవితంలో కొన్ని రోజుల కష్టపడితే జీవితాంతం సుఖంగా ఉండవచ్చని అన్నారు. రోటరీ క్లబ్ వరంగల్ ప్రెసిడెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ పర్వతగిరి మండలంలో రోటరీ క్లబ్ విద్యార్థుల కొరకు చేస్తున్న కార్యక్రమాలను తెలిపారు. కార్యక్రమం అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ పర్వతగిరి 21 మంది విద్యార్థులకు రోటరీ క్లబ్ వరంగల్ వారి సహకారం తో అందించిన సైకిళ్లను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ సంపాదకులుగా డాక్టర్ మడత భాస్కర్, పాఠశాల బృందం రూపొందించిన పాఠశాల మాస పత్రిక “అక్షర వాహిని” జేడీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు.

పర్వతగిరి కస్తూర్బా పాఠశాల పూర్వ విద్యార్థిని ధరావత్ నికిత ఉన్నత చదువుల కొరకు రోటరీ క్లబ్ వరంగల్ వారిచే ఏర్పాటి చేసిన ఆర్థిక సహకారాన్ని జెడి లక్ష్మీనారాయణ విద్యార్థినికి అందించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పర్వతగిరి మండల విద్యాశాఖ అధికారి ఏ.బిక్షపతి వ్యవహరించగా కార్యక్రమంలో పర్వతగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్, రోటరీ క్లబ్ సెక్రెటరీ జి. ఎల్లరాజు, శ్రీకాంత్, డి. నరసింహారావు, రవీందర్, రాజయ్య, సుధాకర్, పర్వతగిరి మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News