HomeతెలంగాణHarish Rao | గ్యాస్ లీక్ ప్రమాదంపై హరీష్ స్పందన..

Harish Rao | గ్యాస్ లీక్ ప్రమాదంపై హరీష్ స్పందన..

  • ఇద్దరు కార్మికులు మరణించడం దురదృష్టం..
  • మూర్తుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి..

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాక కెమికల్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలను అమలు చేయకపోవడం వల్లే పదేపదే పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. గతంలో జరిగిన సిగాచీ ప్రమాదం నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఆయన విమర్శించారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలతో పాటు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

- Advertisement -

కార్మికుల భద్రతను పట్టించుకోకుండా, ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు ఫొటోలకు పోజులివ్వడానికి వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో సిగాచీ పరిశ్రమలో ప్రమాదానికి గురై జీవనోపాధి కోల్పోయిన 54 కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీని వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తుచేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News