Homeసాహిత్యంUN | శాంతి పడవ ఐరాస నడక

UN | శాంతి పడవ ఐరాస నడక

(విశ్వ శాంతి దీపం ఐరాస ప్రయాణం)

(అక్టోబర్24 ఐక్యరాజ్యసమితి(UN)
81వఆవిర్భావ దినోత్సవం
సందర్భంగా రాసిన కవిత)

- Advertisement -

యుద్ధ జ్వాలల బూడిద నుండి
పురుడుపోసుకున్న శాంతి కపోతం
విశ్వ మానవాళి కలల రూపం
ఐక్యరాజ్య సమితి వేదిక

ప్రపంచ దేశాలన్నింటినీ
ఒక తాటిపై నిలిపింది
ఐ రాస జగమంత
ఒకే కుటుంబం అంటూ
వేసింది శాంతి కేక

ఐరాస దినోత్సవఈఏటి నినాదం
నమ్మకాన్ని పునరుద్ధ రించడం.
పరిణామాలను నిర్వహించడం.
అందరికోసం పనిచేయడం.

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా
అగ్రరాజ్యాల అహాలను ఆపుతూ
రక్తపాతపు లోయల అంచున
శాంతి వంతెనలు వేసింది

పోలియోమహమ్మారినితరిమికొట్టి
ఆకలి తీరుస్తూ అక్షరాలు దిద్దిస్తూ
నిరాశ్రయులకు నీడనిస్తూ
మానవత్వపు చేతిని అందించింది

పెద్ద దేశాల స్వార్థం ముందు
కొన్ని సార్లు తలవంచక తప్పలేదు
యుద్ధాల గాయాలు అవుతున్న
పూర్తిగా ఆపడం సాధ్యం కాలేదు

పెద్ద యుద్ధాలు రాకుండా ఆపి
నెగ్గింది ఎన్నో విజయాలు ఆకలి
రోగాలు అంతం చూస్తూ తీర్చింది
పేద దేశాల కష్టాలు

కానీ
వీటో పవర్ల నీడన నలుగుతూ
కొన్ని సార్లు మూగబోయిన మాట
వాస్తవం
బలవంతుల ఆటల ముందు
కొన్నిసార్లు ఇది ఆగిపోయింది

నిస్సహాయ దేశాల రోదనల ముందు
చేతులు కట్టేసిన చట్టం ఐరాస
నిన్న గాజా నేడు ఉక్రెయిన్
యుద్ధమేఘాలు కమ్ముతున్న వేళ
నిరాయుధంగా నిలబడి చూస్తూ
ప్రశ్నార్థకంగా మిగిలింది నేడు
యుద్దాల మంటలు రేగుతున్నా
చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది

గెలుపు ఓటముల ఊగిసలాటలో
వైఫల్యాల గాయాలు ఉన్నప్పటికీ
ఈ విశ్వ శాంతినీ పంచే
ఆశల ధీపం ఐక్యరాజ్యసమితి

లోపాలు ఎన్నున్నా గానీ
జగత్తు కు ఉన్న ఒకే ఒక ఆశ
శాంతిని మోసే పడవలా
సాగాలి ఈ ఐరాస ప్రయాణం(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News