Saturday, April 18, 2026
Homeమెదక్‌Jagadevpur | జగదేవపూర్‌ను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలి

Jagadevpur | జగదేవపూర్‌ను ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలి

  • ఉపసర్పంచ్ మచ్చ గణేష్

రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో జగదేవపూర్‌ను ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని స్థానిక నాయకుడు , జగదేవపూర్ ఉపసర్పంచ్ మచ్చ గణేష్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో అతిపెద్ద మండలంగా, ఉమ్మడి మెదక్ జిల్లాలో 4వ పెద్ద మండలంగా ఉన్న జగదేవపూర్, గత 25 ఏళ్లుగా ఆశించిన అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన.

సొంత వనరులు ఉన్నప్పటికీ కేవలం ఓటు బ్యాంకుగానే ఈ ప్రాంతాన్ని వాడుకుంటున్నారని, ప్రత్యేక నియోజకవర్గ హోదా ఉంటేనే నిధులు, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ‘జగదేవపూర్ సాధన జేఏసీ’గా ఏర్పడాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ మొదలైందని, దీనిని ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News