Homeకరీంనగర్IVY | సాంస్కృతిక స్ఫూర్తికి వేదికైన ఐ వి వై వార్షికోత్సవం.

IVY | సాంస్కృతిక స్ఫూర్తికి వేదికైన ఐ వి వై వార్షికోత్సవం.

ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం కలగలిపిన ఐ వి వై విద్యా సంస్థలలో 2026 వార్షికోత్సవ వేడుకలు నగరంలో సీతారాంపూర్ లోని ఐ వి వై విద్యాసంస్థలలో గురువారం. వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ పసుల జయ శ్రీ, ప్రిన్సిపల్ కోల మాలతి ఆధ్వర్యంలో వేడుకగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

IVY Annual Day Celebration 20261

ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు పసుల మహేష్, కో చైర్మెన్ శ్రీ పాల్ రెడ్డి, గంగుల కమలాకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్య కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థుల తల్లిదండ్రుల కృషి కూడా ఉండాలని, జీవితానికి విలువలు నేర్పించడం, వారి ఆలోచనలకు ప్రేరణ ఇవ్వడం, క్రీడల్లో, కళల్లో, మరియు శాస్త్ర సాంకేతికతలో చూపిన ప్రతిభ గర్వించదగ్గ విషయం అని, ఈ విధంగా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించడం వారి జిజ్ఞాస, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం అని వారు పేర్కొన్నారు.

- Advertisement -
IVY Annual Day Celebration 2026

భారతీయ సంస్కృతిక సంప్రదాయ నృత్యాలైన గణేశ కౌ త్వం తో చిన్నారుల ప్రదర్శన కార్యక్రమం ప్రారంభమైంది .విద్యార్థులు టాలీవుడ్, బాలీవుడ్, యానిమేటెడ్ ధీం, డాన్స్, పర్యావరణాన్ని పరిరక్షించడం, గ్రీన్ ఫ్యూచర్, నాటికలు స్వచ్ఛభారత్, టెక్నాలజీ తో మనిషి సంబంధం, విద్యార్థులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారసత్వ సంపద సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అద్భుతమైన సంస్కృతిక ప్రదర్శనలు, మహారాష్ట్ర పంజాబ్ బాంగ్రా, గుజరాత్, తమిళనాడు భరతనాట్యం , కూచిపూడి వంటి, సంప్రదాయ నృత్యాలను ప్రతి రాష్ట్ర నృత్యం ఆ ప్రాంతపు సంస్కృతిని సంప్రదాయ విలువలను, సంక్రాంతి పండుగను ప్రతిబింబించే విధంగా రంగుల మేళా, తెలుగు రాష్ట్రాల సంప్రదాయాన్ని చూపించడం, అంతేకాక భారత స్వాతంత్ర్య సమరయోధులైన మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి వంటి వీరుల త్యాగస్పూర్తిని ప్రతిబింబించే , దేశభక్తి నృత్యాలు చేసి దేశ ఐక్యతను భిన్నత్వంలో ఏకత్వం చూపించడంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి.

ఇటీవలే పాఠశాలలో ప్రవేశపెట్టిన (shark tank) ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం, ( T ED E D )విద్యార్థులు తమ ఆలోచనలను సృజనాత్మకంగా ప్రసంగాలు ఆవిష్కరణలతో ఇతరులతో పంచుకోవడం లో ప్రతిభ కనపరచిన వారికి, విద్యలో అద్భుతమైన శ్రద్ధ, క్రమశిక్షణ మరియు ప్రతిభ తో రాణించిన విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులు , విద్యా ప్రావీణ్యం , హాజరు , మరియు సామాజిక సేవ , నాయకత్వ నైపుణ్యాలకు గుర్తుగా, ఉత్తమ విద్యార్థి పథకాలు, ప్రశంసా పత్రాలు కూడా పాఠశాల యాజమాన్యం అంద చేశారు.

IVY Annual Day Celebration 20260

అనంతరం విద్య సంస్కృతిక మరియు క్రీడా పోటీలలో తమ ప్రతిభను ప్రదర్శించిన టీం మెస్సీ బృందానికి అభినందనలు తెలిపారు. జీవిత విలువలు, నైతికత, స్నేహం, సహకారం, వంటి ఉత్తమ గుణాలను నేర్పించి ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు, ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం కూడా అందజేశారు. విద్యార్థుల కృషి, ప్రతిభ, మరియు సృజనాత్మక కు ప్రతిబింబం అని, ప్రతి సంవత్సరం ఈ వేదికపై నిలబడే ప్రతి విద్యార్థి మన పాఠశాల గర్వకారణం అని పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ పేర్కొన్నారు .ఈ విధంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు తదితరులు భారీ ఎత్తున రావడంతో పాఠశాల ఆవరణం అంతా పండుగ వాతావరణం నెలకొంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News