Homeస్పోర్ట్స్Cricketers | చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్లు

Cricketers | చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్లు

మహిళా, పురుషుల క్రికెట్ జట్ల విజయం పట్ల తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ శుభాభినందనలు

భారత క్రికెట్‌కు ఇది గర్వకారణమైన సమయం. ముంబై డివై పాటిల్ స్టేడియంలో భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించగా, అదే సమయంలో హోబార్ట్‌లో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాపై విజయం సాధించి సిరీస్ ను 2-1తో అధిక్యంగా ఉన్నారు. ఈ రెండు ఘనవిజయాల సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఏ) సభ్యులు మహిళా, పురుషుల జట్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మూడు వరుస ఓటముల తర్వాత నాకౌట్ దశల్లో ఎలాంటి పొరపాటు లేకుండా అద్భుతంగా ఆడిన భారత మహిళా జట్టు ఈ విజయంతో కొత్త చరిత్రను సృష్టించింది.

- Advertisement -
indian cricket teams historic achievement tca congratulations 1

ఈ సంద‌ర్భంగా టీసీఏ చైర్‌ప‌ర్స‌న్ డీ.కే. అరుణ మాట్లాడుతూ భారత మహిళా జట్టు విజయం కేవలం క్రీడా ఘనత కాదు.. ఇది మహిళా సాధికారతకు ప్రతీక. తెలంగాణలో కూడా మహిళా క్రికెట్ అకాడమీలను అభివృద్ధి చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఇరు జట్లకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నవంబర్ 2న హోబార్ట్‌లో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో, భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేయడం అభినందనీయమని ఆనందం అని అన్నారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాటు, చివర్లో 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మన్ జట్టుకు విజయం అందించడం భారత క్రీడాభిమానులకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని అందించిందని తెలియజేసింది.

WhatsApp Image 2025 11 06 at 8.01.29 PM

టిసిఏ ప్రెసిడెంట్ బీబీ పాటిల్ వ్యాఖ్యానిస్తూ.. ముంబై స్టేడియం గర్జనతో మార్మోగిన ఆ క్షణం భారత క్రీడా చరిత్రలో నిలిచిపోతుందనీ మహిళా జట్టు గెలుపు కేవలం ట్రోఫీ కాకుండా దేశ గౌరవానికి ప్రతీక అని అభినందనలు తెలిపారు. మహిళా జట్టు చూపిన ఫీల్డింగ్, టీమ్ కోఆర్డినేషన్ నిజంగా ప్రపంచ స్థాయిలో అందరూ మెచ్చుకునేస్తాయిలో ఉందంటూ తెలంగాణ నుంచి కూడా యువతులు ఇలాంటి విజయాలను సాధించేందుకు టిసిఏ పూర్తి మద్దతు ఇస్తుందనీ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాలంటూ, శుభాభినందనలు తెలియజేశారు.

indian cricket teams historic achievement tca congratulations

టిసిఏ వైస్ చైర్మ‌న్ నూనె బాల్ రాజ్ మాట్లాడుతూ.. భారత మహిళా జట్టు చూపిన పట్టుదల, ధైర్యం దేశ యువతకు ప్రేరణ కలిగిస్తుందని. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాహసోపేత నాయకత్వం, స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్, రేణుకా సింగ్, పూజా వస్త్రకర్ బౌలింగ్ అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయం సాధించిందనీ భారత క్రికెట్ నేటి స్తితిని చూస్తుంటే భారతమాత కిరీటంలో పొదిగిన వజ్ర కాంతుల ప్రకాశం లా ఉందని అభివర్ణించారు. అదేవిధంగా భారత పురుషుల జట్టు బౌలింగ్ లైన్‌అప్ మ్యాచ్‌ను కట్టిపడేసింది. అర్ష్‌దీప్ సింగ్ యొక్క అద్భుత యార్కర్లు, సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా మధ్య ఇన్నింగ్స్‌లో చూపిన సమతుల్య బ్యాటింగ్.. ఈ విజయానికి పునాదిగా నిలిచాయి అంటూ అభినందించారు.

indian cricket teams historic achievement tca congratulations 2

టిసిఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ దారం గురువా రెడ్డి మాట్లాడుతూ భారత మహిళా మరియు పురుషుల క్రికెట్ జట్లు ప్రతి ప్లేయర్ తమ కృషితో దేశ ప్రతిష్టను సగర్వంగా ప్రపంచ యవనికపై సువర్ణాక్షరాలతో లిఖించారు. రిచా ఘోష్ యొక్క స్మార్ట్ వికెట్ కీపింగ్, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన, షెఫాలీ వర్మ యొక్క ధైర్యవంతమైన షాట్లు ఈ విజయానికి బలమైన పునాది వేశాయని జట్టు విజయానికి తోడ్పడేట్టు చేసిందని భారత మహిళా మరియు పురుష జట్లు అద్భుతమైన ప్రదర్శన దేశంలో క్రికెట్ ఆడే వాళ్లకు ప్రేరణ కలిగిందని భవిష్యత్తులో తెలంగాణా మారు మూల ప్రాంతాల నుండి కూడా ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేసే వేదిక అవుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News