సిగరెట్, బీడీ, పొగాకు ఉత్పత్తులపై పొగతాగడం, పొగాకు సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించి యథేచ్ఛగా ఉత్పత్తులను అమ్ముకోవచ్చు.. ఎలాంటి తప్పు లేదు.. అది నేరం కూడా కాదు.. మద్యం బాటిళ్లపై ఆల్హాహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకం.. అని ముద్రించి అమ్ముకోవచ్చు.. కోట్లు గడించవచ్చు.. తప్పులేదు.. నేరంకాదు.. కానీ తాగి బండి నడిపితే నేరం.. పొగతాగితే క్యాన్సర్ ప్రమాదం.. ఇలాంటి ప్రమాదకర ఉత్పత్తులకు అనుమతి ఇవ్వడం ఎందుకు..? హానికరం అని ప్రకటనలు ఇవ్వడం ఎందుకు..? వాటిని నిషేధిస్తే సరిపోతుంది కదా..? తప్పని తెలిసినా ప్రభుత్వాలకు ఆదాయం కావాలి..! ఇదేమి న్యాయం..? చట్టాలు, న్యాయస్థానాలు ఎందుకు..? కేవలం కంటితుడుపుకోసమేనా..? ప్రజలారా.. వాస్తవాలు గ్రహించి ఆరోగ్యాలను రక్షించుకోండి..మీరు కాటికిపోతారా..? ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడతారా.. నిర్ణియించకోండి..
Aaj Ki Baath | హానికరం అని తెలిసినా అనుమతి ఎందుకు..?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
