Thursday, April 23, 2026
Homeహైదరాబాద్‌ISIA Workshop | హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఏ వర్క్‌షాప్..

ISIA Workshop | హైదరాబాద్‌లో ఐఎస్‌ఐఏ వర్క్‌షాప్..

  • పారిశ్రామిక డీకార్బనైజేషన్ కోసం భారత్–స్వీడన్ భాగస్వామ్యం

ఇండియా –స్వీడన్ ఇన్నోవేషన్స్ యాక్సిలరేటర్ (ISIA) తన 27వ వర్క్‌షాప్‌ను స్వీడన్ క్లీన్‌టెక్ ప్రతినిధి బృందంతో కలిసి ఇవాళ హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించింది. భారతదేశంలో వినూత్నమైన క్లీన్ టెక్నాలజీల వినియోగాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కీలక పరిశ్రమల అధినేతలు, సాంకేతిక నిపుణులు, సుస్థిరత రంగ నిపుణులు పాల్గొన్నారు. ఇండియా-స్వీడన్ ఇన్నోవేషన్స్ యాక్సిలరేటర్ (ISIA) అనేది క్లీన్‌టెక్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడానికి స్వీడన్ చేపట్టిన కీలక ద్వైపాక్షిక కార్యక్రమం.

స్వీడిష్ ఎనర్జీ ఏజెన్సీ సహకారంతో బిజినెస్ స్వీడన్, సీఐఐ-సోరాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలవుతోంది. స్వీడన్‌కు చెందిన క్లీన్‌టెక్ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి, ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన సుస్థిర సాంకేతికతలను భారతీయ పరిశ్రమలు పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవడానికి ఈ ప్రోగ్రామ్ మార్గనిర్దేశం చేస్తుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ 27వ వర్క్‌షాప్‌ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), సీఐఐ-సోరాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ద్వారా నిర్వహించింది. స్వీడిష్ ఎనర్జీ ఏజెన్సీ, బిజినెస్ స్వీడన్ సంస్థలు దీనికి సహకారం అందించాయని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన 40 ప్రముఖ కంపెనీలతో పాటు స్వీడన్‌కు చెందిన 7 ప్రముఖ క్లీన్‌టెక్ కంపెనీలు పాల్గొన్నాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ, స్మార్ట్ గ్రిడ్లు, ఐఓటీ ఆధారిత వ్యవస్థలు, క్లీన్ మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ మెటీరియల్ మరియు రిసోర్స్ ఆప్టిమైజేషన్ వంటి రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ఇక్కడ ప్రదర్శించారు. సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్, సిగ్నోడ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ మహేశ్వరి, బిజినెస్ స్వీడన్ న్యూఢిల్లీ హెడ్ పవన్ తహ్లానీ, స్వీడిష్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతినిధి ఎడ్గార్ డార్బినియన్ ముగింపు ఉపన్యాసంలో సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ ప్రిన్సిపల్ కౌన్సిలర్ కె. మురళీకృష్ణన్ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఈ వర్క్‌షాప్‌లో క్యాండెలా, ఈక్యాప్స్, లిక్సియా, వాల్టెరో, ప్లెక్సిగ్రిడ్, అఫెక్టస్ వంటి కంపెనీలు తమ సాంకేతిక అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చాయని. అలాగే పరిశ్రమల మధ్య కుదిరిన భాగస్వామ్యాలకు సంబంధించి క్రాన్ స్పెషాలిటీ ఫ్లూయిడ్స్, మెటాలెక్స్ క్రయోజెనిక్స్ లిమిటెడ్ వంటి విజయవంతమైన ఉదాహరణలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అనంతరం వివిధ అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్లు, చర్చలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News