Thursday, April 23, 2026
Homeఆదిలాబాద్Aksharabyasam | 11వ వార్డు అంగన్వాడీ సెంటర్ లో పలు కార్యక్రమాలు

Aksharabyasam | 11వ వార్డు అంగన్వాడీ సెంటర్ లో పలు కార్యక్రమాలు

బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డ్ లోని అంగన్వాడీ సెంటర్ లో వార్డ్ కౌన్సిలర్ గాలి సుమలత-శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరాభ్యాసం, సామూహిక అన్న ప్రాసన మరియు చిన్నారులకు దుస్తుల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.శ్రీ.దావ స్వాతి-రమేష్ బాబు.

ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రంలో బాలింత తల్లులకు, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందించే ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో పాల్గొన్న 10వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ. *డీకొండ పద్మావతి కాంగ్రెస్ నాయకుడు నీలి కృష్ణ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోచంపల్లి హరీష్, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, వారి తల్లులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News