Homeక్రైమ్ వార్తలుIFSA | మ‌హిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌పై ఆ ప్రసారాలు సరికాదు

IFSA | మ‌హిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌పై ఆ ప్రసారాలు సరికాదు

టీవీ ఛానల్ తీరును ఖండించిన తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జా సంక్షేమం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్న మహిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌(Women IAS Officers)పై తప్పుడు ప్ర‌సారాలు(False Broadcasts) చేసిన ఒక ప్రముఖ‌ టీవీ ఛానల్(Popular TV channel) ప్ర‌సార తీరుతెన్నుల‌ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్(Indian Forest Service Association-IFSA) తెలంగాణ చాప్టర్ (T.S. Chapter) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, బాధ్యతలేని, అనైతికమైనవని సంఘం పేర్కొంది. ఈ మేర‌కు శనివారం ఆ సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్(Priyanka Varghese) మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ప్ర‌సారంలో వాస్త‌వం లేద‌ని, ప‌రువు నష్టం కలిగించే విషయాలు ఉన్నాయని సంఘం వెల్ల‌డించింది. ప్రజల కోసం సేవ చేస్తున్న మహిళా అధికారుల గౌరవం, గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠను పూర్తిగా అవమానించినట్లుగా ఈ ప్రసారం ఉందని అభిప్రాయ‌ప‌డింది.

- Advertisement -
WhatsApp Image 2026 01 10 at 19.50.32

అధికారుల పోస్టింగ్‌లు, వ్యక్తిగత విషయాలపై చేసిన అన్ని ఆరోపణలను సంఘం పూర్తిగా తిరస్కరించింది. ఇలాంటి బాధ్యతలేని ప్రసారాలు నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, సంస్థలపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయని పేర్కొంది. సంబంధిత ఛానళ్లు వెంటనే బహిరంగంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంఘం డిమాండ్ చేసింది. అభ్యంతరకరమైన ఈ కంటెంట్‌ను అన్ని మీడియా, డిజిటల్ వేదికల నుంచి తక్షణమే తొలగించాలని కోరింది. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకొని వారి గౌరవంపై దాడి చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News