Homeహైదరాబాద్‌Ramzan | ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు..

Ramzan | ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు..

  • శనివారం హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద భారీ సంఖ్యలో హాజరు..
  • ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన నిర్వహణ..

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అక్కడి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ప్రార్థనల అనంతరం ఆయన చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులందరూ సుఖసంతోషాలతో, ప్రశాంతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Hyderabad Eid ul Fitr Celebrations at Mir Alam Eidgah

రంజాన్ మాసమంతా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగియడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల షాపింగ్ అవసరాలకు, ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామని, అందరి సహకారంతో వేడుకలు విజయవంతంగా సాగాయని వివరించారు. పండుగ ఏర్పాట్లలో సహకరించిన మత పెద్దలకు, ఇతర ప్రభుత్వ విభాగాలకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
Hyderabad Eid ul Fitr Celebrations at Mir Alam Eidgah2

ఈ కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్, ఐపిఎస్ (అడిషనల్ సిపి – సౌత్ రేంజ్), డి.జోయల్ డెవిస్ ఐపిఎస్ జాయింట్ సిపి ట్రాఫిక్, ఎన్. స్వేతా, ఐపిఎస్ (జాయింట్ సిపి – నార్త్ రేంజ్), ఆర్.వెంకటేశ్వర్లు ఐపిఎస్ డిసిపి సిఎఆర్ హెడ్ క్వార్టర్స్, ఎస్. శ్రీనివాస్, ఐపిఎస్ (డిసిపి – రాజేంద్ర నగర్ జోన్), అవినాశ్ కుమార్ ఐపిఎస్ డిసిపి ట్రాఫిక్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News