Thursday, January 22, 2026
EPAPER
Homeహైదరాబాద్‌Visitors | భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌పోకి భారీగా సందర్శకులు

Visitors | భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌పోకి భారీగా సందర్శకులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌పో (Bharat Future City Expo) అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఈ నెల 10–13 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్స్‌పోకి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వేలాది మంది విద్యార్థులు, పౌరులు తెలంగాణ విజన్ (Telangana Vision) 2047ను కళ్లకు కట్టే టెక్, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ మొబిలిటీ మోడల్స్, అర్బన్ ప్లానింగ్ షోకేస్‌లను ఆసక్తిగా తిలకించారు.

హ్యూమన్-ఫేస్ AI బాట్ (Human Face AI Bot) అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. సందర్శకులతో ప్రత్యక్షంగా సంభాషించడం, భవిష్యత్ మౌలిక సదుపాయాలు, స్థిరత్వం, స్మార్ట్ సిటీలపై ప్రశ్నలకు ఏఐ బాట్ సమాధానమిచ్చింది. కైనెటిక్ మోషన్ విజువల్స్, పారదర్శక డిజిటల్ డిస్‌ప్లేలు ఎక్స్‌పోను యువతకి కనెక్ట్ చేశాయి. ప్రధాన అభ్యాస, ప్రేరణ కేంద్రంగా మార్చాయి. తెలంగాణ భవిష్యత్ వృద్ధి రోడ్‌మ్యాప్‌కు నిజమైన ప్రజా వేడుకగా విజయవంతంమైంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News