Homeఆంధ్రప్రదేశ్AP | పేలుడులో గాయపడ్డ కానిస్టేబుళ్లకు అండగా ఉంటాం..

AP | పేలుడులో గాయపడ్డ కానిస్టేబుళ్లకు అండగా ఉంటాం..

  • గాయపడ్డ వారిని పరామర్శించిన హోం మంత్రి..

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు ఘటనలో గాయపడ్డ పోలీసులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పోలీసులకు ధైర్యం చెప్పారు . పోలీసుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత మంగళవారం చల్లపల్లి పోలీసులు దీపావళి సమయంలో సీజ్‌ చేసిన టపాసులను సీజ్‌ చేశారు. వీటిని పంచనామాకు సిద్ధం చఏస్తుండగా కిందపడి పేలిపోయాయి.

- Advertisement -

ఈ పేలుడులో ఎస్సై దుర్గావీరాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ తేజ, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన నలుగుర్ని వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. ఈపేలుడు దెబ్బకు పోలీస్ స్టేషన్‌లోని ఫర్నీచర్‌, బయట నిలిపి ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News