Homeనల్లగొండHoliday | స్కూళ్లు, అంగన్‌వాడిలకు సెలవు

Holiday | స్కూళ్లు, అంగన్‌వాడిలకు సెలవు

  • భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • దేవరకొండ డివిజన్‌లో కలెక్టర్ పర్యవేక్షణ
    ​- లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలి
  • డిండి వాగు పక్కనే ఉన్న హాస్టల్‌లోకి చేరిన వరద
  • 500 మంది విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు

నల్గొండ: మొంథా (Mantha) తుపాను (Cyclone) కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు (Public) అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ (Collector) ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం దేవరకొండ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా పాఠశాలలు(Schools), అంగన్‌వాడి (Anganwadi) కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

WhatsApp Image 2025 10 29 at 19.34.38 1

హాస్టల్‌లోకి వరద 500 మంది తరలింపు

- Advertisement -

​దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌లోకి వర్షపు నీరు చేరిన విషయాన్ని కలెక్టర్‌ గుర్తించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటం, కొమ్మేపల్లి ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల హాస్టల్‌లోకి వరద నీరు చేరిందివి.ద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో 500 మంది విద్యార్థులను, 26 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పక్కనే ఉన్న బీసీ హాస్టల్‌లోకి తరలించారు.​

WhatsApp Image 2025 10 29 at 19.34.36

కొమ్మపల్లి పాఠశాల లోతట్టు ప్రాంతంలో ఉండడం, డిండి వాగు పక్కనే ఉండడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, భవిష్యత్తులో ఇలా జరగకుండా శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని కలెక్టర్ తెలిపారు.భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు.లోతట్టు ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.లో లెవెల్ కాజ్‌వేలు, పొంగి ప్రవహించే రోడ్లు, బ్రిడ్జిలపై నుంచి, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని జిల్లా ప్రజలకి సూచించారు.నీటి పరివాహక ప్రాంతాల్లోకి చేపలు పట్టేందుకు, బట్టలు ఉతికేందుకు వెళ్లవద్దని,పశువులను పొలాలవైపు తీసుకువెళ్లవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

WhatsApp Image 2025 10 29 at 19.34.37 2

​భారీ వర్షాల హెచ్చరికలు: ఎస్పీ శరత్‌చంద్ర పవార్

​జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ.. కొమ్మేపల్లిలోని ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి పొలాల నుండి నీరు రావడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అదనపు బలగాలను ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని ఎస్పీ చెప్పారు.

WhatsApp Image 2025 10 29 at 19.34.37

అనంతరం కలెక్టర్ ఇదే మండలంలోని పర్స తండా వద్ద వర్ష పరిస్థితిని పరిశీలించారు. వర్షపు నీరు ఉద్ధృతంగా వచ్చి తండా చెరువులో చేరడం, ఒకవేళ చెరువుకు గండి పడితే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.ఈ పర్యటనలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణా రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవోలు మధుసూదన్ రెడ్డి, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025 10 29 at 19.34.36 1
- Advertisement -
RELATED ARTICLES

Latest News