HomeతెలంగాణHMDA Land Auction | హెచ్.ఎం.డీ.ఏ. కు షాక్..

HMDA Land Auction | హెచ్.ఎం.డీ.ఏ. కు షాక్..

  • విలువైన భూముల ఈ-వేలానికి ఒక్క బీడ్ కూడా దాఖలు కానీ వైనం..HMDA Land Auction
  • వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్ళీ వేలం..

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి ఊహించని షాక్ తగిలింది. అత్యంత విలువైన రెండు కీలక భూముల ఈ-వేలానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు ఆ ప్రక్రియను రద్దు చేశారు. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్, మూసాపేటలోని ఈ భూములను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మళ్లీ వేలానికి ఉంచాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.HMDA Land Auction

వివరాల్లోకి వెళితే.. కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లో 4.59 ఎకరాల (ప్లాట్ నెం. 17) భూమికి ఎకరాకు రూ. 120 కోట్లు, కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేటలో 3.15 ఎకరాల స్థలానికి ఎకరాకు రూ. 99 కోట్లుగా హెచ్‌ఎండీఏ కనీస ధరను (అప్‌సెట్ ప్రైస్) నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఈ వేలంలో పాల్గొనేందుకు ఒక్క సంస్థ లేదా వ్యక్తి కూడా ముందుకు రాలేదు. దీంతో వేలం ప్రక్రియను రద్దు చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.HMDA Land Auction

- Advertisement -

కనీస ధరలు చాలా అధికంగా ఉండటమే ఈ నిరాసక్తతకు ప్రధాన కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నియోపోలిస్ ప్లాట్‌కు ఎకరాకు రూ. 99 కోట్లు, మూసాపేట భూమికి రూ. 80 కోట్ల వరకు ధర ఉంటే బాగుండేదని పెట్టుబడిదారులు భావించినట్లు తెలుస్తోంది. కాగా, ఇదే కోకాపేట ప్లాట్‌ను 2026 సెప్టెంబర్‌లోనూ ఇదే ధరతో వేలానికి ఉంచగా, అప్పుడు కూడా కేవలం ఒక్కరే బిడ్ వేయడంతో ఆ ప్రక్రియను రద్దు చేసిన విషయం తెలిసిందే.

మూసాపేటలోని సర్వే నంబర్ల వివాదంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఒక ట్రక్ అసోసియేషన్ మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వేలంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో హెచ్‌ఎండీఏ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది. అయినప్పటికీ, బిడ్డర్ల నుంచి స్పందన కరువైంది. అంతకుముందు గురువారం జరిగిన బంజారాహిల్స్‌లోని 8 హుడా లేఅవుట్ ప్లాట్ల వేలానికి కూడా ఒక్క బిడ్ కూడా రాలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News