Thursday, June 4, 2026
HomeజాతీయంTamil Nadu | రాజ్యాంగంపై గౌరవం..

Tamil Nadu | రాజ్యాంగంపై గౌరవం..

  • పెళ్ళిపీటల మీద నుంచి నేరుగా పోలింగ్ బూత్ కి..
  • పెళ్లికొడుకుపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

ఓ కొత్త పెళ్లి కొడుకు ప్రజాస్వామ్యంపట్ల, భారత రాజ్యాంగంపట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. ఈరోజుల్లో యువతలో చాలామంది ఫ్రెండ్స్‌తో పార్టీ ఉందని, టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూడాలని, హాయిగా నిద్రపోవాలని ఇలా అసంబద్ద కారణాలతో ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటును బాధ్యతగా కాకుండా అనవసర పనిగా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులోని కాంచిపురం జిల్లాకు చెందిన ఓ పెళ్లికొడుకు ప్రజాస్వామ్యంపట్ల తనకున్న బాధ్యతను నిరూపించుకున్నాడు.

వేదికపై పెళ్లి తంతు ముగియగానే వధువుతో కలిసి నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకుని అధికారుల చేత శభాష్‌ అనిపించుకున్నాడు. పెళ్లికొడుకు చేసిన పనిని అతడి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు కూడా అభినందించారు. నూతన దంపతులు ఓటు వేయడం కోసం పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News