Thursday, January 22, 2026
EPAPER
Homeనల్లగొండYadadri | వైభవంగా వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

Yadadri | వైభవంగా వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

ఆలయ ఈవో వెంకట్రావు సమీక్షా సమావేశం

యాదగిరిగుట్ట, డిసెంబర్ 7(ఆదాబ్ హైదరాబాద్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన నిర్వహించే వైకుంఠ ఏకాదశి (Vaikunta ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించటానికి ఆలయ ఈవో వెంకట్రావు ఆదివారం సాయంత్రం అర్చకులతో, అధికారులతో సమీక్షా సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వార దర్శనం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉండేదని, కానీ ఈ సంవత్సరం భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులందరికీ స్వామివారి ఉత్తరద్వార దర్శనం (Uttaradwara darshanam) భాగ్యం కలిగే విధంగా ఉదయం నుండి రాత్రి వరకు అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ప్రస్తుత అర్చక సిబ్బందితోపాటు అదనంగా వైకుంఠ ఏకాదశి రోజు పారాయణ దారులు అధ్యాపక స్వాములతో విశేష సేవారాధన, అలంకార స్వాములతో శోభాయమానంగా శ్రీస్వామివారి సేవ అలంకరణలు చేయాలని నిర్ణయించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఉత్తరద్వారం పూల అలంకరణ(Flower Decoration)తో మామిడి తోరణాలతో అత్యంత సుందరంగా అలంకరించనున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకొనే భక్తులకు, దాతలకు, ప్రముఖులకు ప్రత్యేకంగా ఉత్తర ద్వారంలో మాడవీధుల్లో సెక్టార్ ఏర్పాటుచేయుటకు ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. ఆలయ గోపురం దేదీప్యమానంగా వెలుగొందేలా విద్యుత్ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ విభాగం వారిని ఆదేశించారు.

వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకీ అనుగుణంగా ట్రాఫిక్ రెగ్యులేట్, భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ఓ ఎస్పీఎఫ్ వారిని తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులందరికీ ప్రత్యేకంగా ఉత్తర వైకుంఠ ఏకాదశి రోజున పొంగలి ప్రసాదం అందజేయాలని, అంతేకాక త్వరితగతిన దర్శనాలు కల్పించటానికి క్యూలైన్లు నిర్వహణకు, సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి రోజున సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, నవీన్, జూసెట్టి కృష్ణ ,శంకర్ నాయక్, ఈఈ దయాకర్ రెడ్డి, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రచార్యులు, సూపరింటెండెంట్ రాజన్ బాబు, నటరాజ్, శ్రీలత, వెంకటేష్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News