Homeఆదిలాబాద్Awareness | ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన.

Awareness | ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన.

బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ శాస్త్రవేత్త బి. తిరుపతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ నిషేధం లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.

Students Educated On Harmful Effects Of Plastic At GPL Degree College

ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన విద్యార్థులకు వివరించారు. సి.పి.సి.బి (CPCB) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బయో-డిగ్రేడబుల్ (జీవ విచ్ఛిన్నం చెందే) సంచుల వివరాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Students Educated On Harmful Effects Of Plastic At GPL Degree College1
- Advertisement -
RELATED ARTICLES

Latest News