బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్యెల్యే (Balkonda Mla) ప్రశాంత్‌రెడ్డి (PrashanthReddy) 233 కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై సంతకాలు చేశారు. వీరికి చెక్‌లు మంజూరు కావాల్సి ఉంది. ఇందులో వేల్పూర్ మండలంలో 87, భీంగల్ మండలంలో 104, ఏర్గట్ల మండలంలో 32 దరఖాస్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధదారులకు తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చెక్‌లతోపాటు బంగారం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు బకాయిపడ్డ ప్రతిఒక్కరికీ బంగారం ఇవ్వాలని అన్నారు.
- Advertisement -
